Breaking News

ఆ… మహనీయుడే నాకు స్పూర్తి… : డాక్టర్ హసీమ్ బేగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించడంలో అహర్నిశలు పరుగులు పెడుతూ ఏడుపదుల వయసులో నవ యువకుడిలా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మచిలీపట్నం 15వ డివిజన్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువతఉపాధ్యక్షులు డాక్టర్ హసీమ్ బేగ్ నిరుపేదలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హసీం బేగ్ మాట్లాడుతూ ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశ్యముతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆఖరి తీరుస్తున్న చంద్రబాబు నాయుడు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ప్రతి పేదవాడు కోరుకుంటాడని డాక్టర్ హసీం బేగ్ అన్నారు. గత ప్రభుత్వం పేదలను విస్మరించి నిరుపేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను మూసి వేయించాడని తమ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని, నిరుపేదల అవసరాన్ని గుర్తించి తీరుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పండుగ పురస్కరించుకుని మచిలీపట్నం 15వ డివిజన్లో నిరుపేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ హసీం బేగ్అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో డాక్టర్ హసీం బేగ్ ముందు ఉంటారని స్ఫూర్తి ప్రదాత అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి చాలా గొప్పదని ఆ నాయకుడు పుట్టినరోజు పేదల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు లియాస్ పాషా, 48 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పివి ఫణి కుమార్, గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ అబ్దుల్ అజీమ్, వాడపల్లి మహేష్, వెంకట దాసు, ఎస్.కె అక్బర్, 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *