Breaking News

వై.ప్రసన్న వెంకటేష్, I.A.S కి ప్రధాన మంత్రి జాతీయ అత్త్యుత్తమ పురస్కారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అత్త్యుత్తమైన సేవలను గుర్తించి ప్రతీష్టాత్మక “ప్రధాన మంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్సి ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2023” అవార్డు ఢిల్లీ లో జరిగిన 17th Civil Services Day సందర్భంగా వై..ప్రసన్న వెంకటేష్, I.A.S., కి దేశవ్యాప్తంగా I.A.S లకు ఇచ్చే అత్యుత్తమైన పురస్కారం లభించింది. ఏలూరు జిల్లాకు మొదటి కలెక్టర్ గా రెండు సంవత్సరాలకు పైగా చేసిన విశేషమైన కృషి ఫలితంగా ప్రధాన మంత్రి అవార్డుకు ఎంపికైనారు. జిల్లాలో పౌర సేవలు, ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు చేరవేయుట, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అమలు, రక్త హీనత నివారణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, గిరిజన మండలాల్లో ” అక్షజ” కార్యక్రమం, గర్భిణీ బాలింతల ఆరోగ్యం, విద్య వైద్య ప్రాధాన్యత, తదితర అంశాలలో సలిపిన కృషి ఫలితంగా ఈ నాటి ప్రధాన మంత్రి అత్త్యుత్తమ అవార్డుకు కారణాలు. దేశంలోని 16 జిల్లాలు ఎంపిక చేయగా వై.ప్రసన్న వెంకటేష్ సారథ్యంలో నడిచిన ఏలూరు జిల్లా ఒకటి. వె. ప్రసన్న వెంకటేష్, I.A.S ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ యావత్తు సిబ్బంది వై.ప్రసన్న వెంకటేష్, I.A.S కి ప్రత్యేక అభినందనలు తెలియచేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *