Breaking News

తిరుపతి నగరంలోని వివిధ ట్యాంకుల సుందరీకరణ పనులు, ప్రాధాన్యతగా తీసికొని వేగంగా పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని పలు ట్యాంకులు(కుంటలు) సుందరీకరణ పనులను ప్రాధాన్యతగా తీసికొని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.వెంకటేశ్వర్ తెలిపారు.

బుదవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు తిరుపతి నగరం లోని వివిధ ట్యాంకర్ల సుందరీకరణ పనుల పురోగతి పై జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్ డి ఓ లు రామ్మోహన్, భానుప్రకాష్ , డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి వనరులను అభివృద్ధి చేయడానికి ట్యాంకుల పునరుద్ధరించడo కోసం సుందరీకరణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా దామినేడు, పేరూరు ,ఆవిలాల రామక్క చెరువు, తూకివాక వెంకటాపురం, వెలమండ్యం వినాయక సాగర్, పాన్ చెరువు, గొల్లవాని గుంట, కోరమేనుగుంట చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా స్మార్ట్ సిటీ లో భాగంగా వినాయకా సాగర్, గొల్లవాణి గుంట ఇప్పటికే అభివృద్ధి చేశారని, మిగిలిన వాటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొరమేను గుంట చెరువుకు సంబంధించిన వాకింగ్ ట్రాకర్స్, ప్లాంటేషన్ సంబంధించిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *