Breaking News

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

-జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి కి నిరసనగా – ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ఉగ్రవాదం నశించాలి అంటు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాకిస్తాన్ అరాచక – వికృత శాష్టలకు వ్యతిరేకంగా గురువారం విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రపంచ అంబేద్కర్  విగ్రహం వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-జమ్ము కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పెహల్గాం నగరంలోని  బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని హతమార్చడాన్ని దేశావ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు అని, పొరుగు దేశానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ,కచ్చితంగా ఈ సంఘటనకి మూల్యం చెల్లించే తరుణం అతి సమీపంలోనే ఉంటుంది అని,  అసువులు బాసిన  పౌరులకు బాసటగా భారతదేశం ప్రభుత్వం, భారతదేశంలోని  145 కోట్లమంది వారి కుటుంబాలకు సానుభూతి తెలిపి వారి వెంటే ఉంటారని, స్వతంత్ర భారతదేశం మొదటినుండి ప్రపంచ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది అని, పొరుగు దేశమైన పాకిస్తాన్ వారి అరాచక చాష్టలతో శాంతియుతంగా ఉన్న శాంతియుతంగా ఉన్న భారత దేశ ప్రజానీకాన్ని ప్రజానీకాన్ని ఉగ్రవాదంతో లేనిపోని అశాంతిని కలిగిస్తుందని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని, భారతదేశ సైన్యం ముందు పాకిస్తాన్ తలంచక తప్పదని ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి సంగతి ఈ సందర్భంగా బోండా ఉమా గుర్తు చేశారు. గతంలో పాకిస్తాన్ ను భారతదేశం ఏ రకంగా అయితే ఓడించిందో త్వరలోనే త్వరలోనే మరొకమారు భవిష్యత్తులో జరగక తప్పదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం, ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ ఏఎంసి డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, కాకొల్లు రవి, Sk బాబు, లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోతుకూరి కాశ్యం, బత్తుల కొండ, పైడి శ్రీను, జలకం రాజా, దాసరి ఉదయశ్రీ, ఆకుల సూరి, దాసరి కనకారావు, కంచి ధన శేఖర్, బేవర సూరి, కంచేటి నాగరాజు, Sk జాన్ వలి, పిరియ సోమేశ్వరరావు, కూర్మాపు దుర్గారావు, ఇమ్మిడి రాము, మద్దినేని సుబ్రహ్మణ్యం, నందేటి లక్ష్మణ్ సింగ్, బొలిశెట్టి శేషుబాబు, నవీన్, కాకొల్లు మహేంద్ర నాథ్ (బాబీ), గడ్డం శ్రీను, దాట్ల రాజేష్, సంధి రెడ్డి గాయత్రి, LSR, భద్రం, కర్ణం రవణ, PVR, సింగం వెంకన్న, అంగిరేకుల రాంబాబు, దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, వల్లభనేని సతీష్, మాచర్ల గోపి సుబ్బారావు, సుబ్బారావు, సాయి, ఇజ్జాడ దుర్గారావు, బత్తుల అప్పారావు, గుడ్డెటి మురళి, కొమ్మినేని సురేష్, తదితర వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *