తడ, తడకండ్రిగ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తడ మండలంలోని తడకండ్రిగ మజరా బోడిలింగాలపాడు గ్రామాన్ని సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి తో కలిసి సందర్శించడం జరిగింది. సదరు గ్రామానికి చెందిన రెవెన్యూ సదస్సు గ్రీవెన్స్ లో అంద చేసిన త డ మండలంలోని తడ కండ్రిగ గ్రామపంచాయతీకి చెందిన చిలమత్తూరు నటరాజన్, సుందరం అన్నదమ్ములు చెందిన 13 సెంట్లు పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ సదస్సులలో అర్జీ ఇవ్వగా రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యకు పరిష్కారంగా ఆయన 13 సెంట్లు పొలానికి పట్టాదారు పాసు పుస్తకం అందించడం జరిగింది. రెవెన్యూ సదస్సులో వస్తున్న సమస్యల పరిష్కారం పొందగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా వారిని కలిసి పాస్ పుస్తకం గురించి అడగగా అందించారని తెలిపారు. సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ షెడ్, కూరగాయల మార్కెట్ కొరకు గవర్నమెంట్ ల్యాండ్ కావలేనని తడ కండ్రిగ సర్పంచ్ తుమ్మా జయప్రద గారు తగు సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళగా వాటి పరిష్కార దిశగా కృషి చేస్తాను అన్నారు.
Prajavartha Online Telugu News