రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వానికి, పరిపాలన యంత్రాంగానికి , మీడియా కు మధ్య వారధిగా జిల్లా పౌర సంబంధాల అధికారి కీలకమైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను డీపీఆర్వో వై. బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లాలో నూతనంగా ఏపీపీ ఎస్సీ ద్వారా ఎంపికై తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం పట్ల అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో కీలక బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులతో సమన్వయం సాధించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తీసుకుని వెళ్లడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా లో నూతనంగా జిల్లా పౌర సంబంధాల అధికారి గా జాయిన్ అయిన బాలకృష్ణ యల్లాప్రగడ స్వస్థలం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం , ఆరేపల్లి కురప్పాలెం కు చెందిన వారు. వీరి తల్లితండ్రులు వెంకట శేష సూర్యనారాయణ శర్మ, రుక్మిణి. బాలకృష్ణ మాస్టర్ ఆఫ్ డిగ్రీ చదివి అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఇన్ జర్నలిజమ్ లో మాస్టర్ డిగ్రీ పొందడం జరిగింది. తొలుత 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి లో తెలుగు ట్రాన్సలేటర్ గా ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. 2022 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, తూర్పు గోదావరి జిల్లా కు కేటాయించడం జరిగింది.
ఈ సందర్భంగా డీపీఆర్వో వై. బాల కృష్ణ కి అభినందనలు తెలియచేసిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, కే ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, ఎస్ ఈ ట్రాన్స్ కో కే తిలక్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్, డివిజన్ పీఆర్వో ఎమ్. లక్ష్మణాచార్యులు, ఇతర అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News