Breaking News

ఉచిత ఇసుకపై బహిరంగ చర్చకు సిద్ధమా?

-మాజీ ఎంపి నానికి. డూండీ రాకేష్ స‌వాల్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పార‌ద‌ర్శ‌కంగా ఉచిత ఇసుక విధానం అమ‌ల్లో వుంటే ఇసుక దోపిడి జ‌రుగుతోందంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్న విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని గత ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.లక్ష పెట్టి కొన్నారు.
ఆ స‌మ‌యంలో ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? దీనికి సమాధానం చెప్పే ధైర్యం కేశినేని నానికి ఉందా..? అంటూ ఆర్య‌వైశ్య వెల్పేర్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే ఈ విష‌యాల‌పై కేశినేని నాని బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు.
ఎంపి కేశినేని నాని సోష‌ల్ మీడియా వేదిక‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం పై ఎంపి కేశినేని శివ‌నాథ్ పై చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ శ‌నివారం విద్యాధ‌ర‌పురంలోని త‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా డూండీ రాకేష్ మాట్లాడుతూ గత ఐదేళ్లు ఇసుక దోపిడి వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలో కేశినేని నాని జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆ రోజైనా..ఈరోజైనా జగన్మోహన్ రెడ్డి కి కేశినేని నాని కోవర్టు అన్నారు. ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. తాను రాజ‌కీయ‌ల‌కు దూరం అంటూనే రాజకీయ నాయకుల గురించి ట్వీట్ చేస్తున్నాడు..త‌ను ఏ పార్టీ నాయకుడో కండువా వేసుకొని చేప్పే దమ్ము , ధైర్యం కేశినేని నానికి ఉన్నాయా? అంటూ ప్ర‌శ్నించారు. ఎపి జెన్ కో ఫ్లై యాష్ కోసం టెండ‌ర్ కి ప‌లిచింది..ఆ టెండ‌ర్ ఎవ‌రైనా వేసుకోవచ్చు అన్నారు. ఈ విష‌యం ప‌బ్లిక్ డొమైన్ లో వుంద‌న్నారు. కేశినేని నాని క్లీనర్ కి ఎక్కువ.. ఓనర్ కి తక్కువ.. మీడియా ముందుకు వచ్చే దమ్ము లేదు. జగన్ పబ్జీ అడుతున్నట్లు కేశినేని నాని కూడా ఫోన్ లో గేమ్స్ లేదా ట్వీట్టర్ లో పోస్టు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. నాని ఎంపీగా ఉన్న సమయంలో విజయవాడ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూప్ రాజ‌కీయాలు న‌డిపారన్నారు. ఎంపీగా చంద్రబాబునాయుడు అవకాశం ఇస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేశినేని నాని అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏ రీచ్ లో అక్రమాలు జరుగుతున్నాయో నిరూపించగలరా? ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత ఇసుకపై బహిరంగ చర్చకు కేశినేని నాని సిద్దమా…? ఎన్డీయే కూటమి ఉచిత ఇసుక ఇస్తుంటే కేశినేని నానికి కనబడట్లేదా? అంటూ ఈ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేశినేని నానికి సరైనా సమాధానం చెబుతామ‌న్నారు.
పహల్గాం దాడిలో చనిపోయిన భారత పౌరులకు మౌనం పాటిస్తూ.. దేశ ప్రజలందరూ ఒకేతాటికిపైకి వచ్చి ముక్తకఠంతో పోరాటం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరోక రకం ఉగ్రవాదులు తయారైయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉగ్రవాదుల ముఖ్య ఉద్దేశ్యం ఎవరకి ఉపాధి అందకుడదు.. ఏ ఒక్కరు వ్యాపారం చేయకూడదు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి ప్రజల ఆదాయాన్ని దిగజార్చాలని ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద కంపెనీకి సంబంధించిన ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు.
గత వారంరోజులుగా మాజీ నాయకుడు కేశినేని నాని మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఏనాడు ప్రజల సమస్యలపై పోరాటం చేయలేదు. ట్వీట్టర్ లో ట్వీట్ పెట్టగానే ఆయన వెనుకాల ఉన్న ఉగ్రవాది గ్యాంగ్ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తున్నారని తెలిపారు.. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు..
ప‌రిశ్ర‌మ‌లు స్థాపించ‌బోయే కంపెనీలకు తక్కువ రేటుకు భూమి ఇవ్వడం తప్పు అని ట్వీట్ చేశాడు. అంటే ఉపాధి కల్పించే సంస్థలకు భూమి ఇవ్వకుండా ఏమి ఇవ్వాలి? వాళ్ల లాగా లంచాలు తీసుకోవాలా? డబ్బా కంపెనీలకు అనుమతి ఇవ్వాలా? ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకునే కంపెనీలకు వైసీపీ నాయకులు పెట్టారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి కల్పించే కంపెనీలను తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వాన్ని స్వాగతించాలని కోరారు.
ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్,రాష్ట్ర తెలుగు మ‌హిళా ఉపాధ్య‌క్షురాలు ఆషా, డివిజ‌న్ అధ్య‌క్షులు ప‌త్తి నాగేశ్వ‌ర‌రావు, శివాజీ ముదిరాజు, కొనికి కొండ‌య్య‌, రేగ‌ళ్ల ల‌క్ష్మ‌ణ‌రావు, సీనియ‌ర్ నాయ‌కులు వి.వి.కె న‌ర‌సింహారావు, సుర‌భి బాలు, శివ‌శ‌ర్మ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *