విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం రాత్రి గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, హిందూ ముస్లిం భాయి భాయి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాధాలు చేశారు. గ్రామ పెద్ద బడుగు మరియదాసు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కులాలకు మతాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి భారతదేశంలో మంటలు రాజేసేందుకు దాయాధులైన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విహార యాత్ర కు జమ్ము కాశ్మిర్ వెళ్లిన భారతీయులను మతం పేరు చెప్పించి మరి చెప్పడం దారుణం అన్నారు. ఎన్ని ఉద్రిక్తలు వచ్చినా భారతీయులంతా కులాలకు మతాలకు అతీతంగా ఉండి మనమంతా ఒకటే అంటూ భారతదేశం ఫస్ట్ తర్వాతే మేము అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడుగు బాలమ్మ, కంభంపాటి లక్ష్మి, ముద్రబోయిన శ్రీను, గండికోట దసరద, నక్కా ఆదినారాయణ, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ములికి రమాదేవి, కుప్పాల రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News