-విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడపిల్లలు చదువులో ముందంజలో ఉండాలి అని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ, కస్తూరిబాయిపేట , నవోదయ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కొల్లి స్వాతి SSC 2025 సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో NTR డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన కొల్లి స్వాతిని నగర ప్రథమ పౌరురాలు, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ద్వారా న 5116/- నగదును మరియు సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆడపిల్లలందరూ చదువులోనే కాకుండా అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని. చదువలలో మొదటి ర్యాంక్ సాధించిన స్వాతి అందరికీ స్ఫూర్తిదాయకమని, ఇలాగే ఆడపిల్లలందరూ అని రంగాల్లో ముందంజలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ అల్లూరి శ్రీధర్ రెడ్డి మరియు వారి ఉపాధ్యాయురాలు గుజ్జరి ఈశ్వరి మరియు వారి ఉపాధ్యాయ బృందము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News