Breaking News

నా స్థలమును నాకు ఇప్పించండి – షేక్ జలీల్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తన స్థలమును తనకు ఇప్పించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన గాంధీనగర్ ప్రెస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా నల్లపాడు లో తనకు 250 చదరపు గజాల స్థలం ఉందని అందులో 70 చ.గ లో రూములు, 150 చ.గ లలో ఖాళీ స్థలం తన స్వాధీనంలో ఉందని తెలిపారు. తనకు అవసరం అయ్యి 2016 సంవత్సరంలో గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ దగ్గర తన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు రొక్కముగా తీసుకున్నానని అన్నారు. అందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నామని తెలిపారు. డబ్బు ఇచ్చేసి తన ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుందామని వెళితే తనను బెదిరించారని వాపోయారు. అంతేకాకుండా తనమీద అక్రమ కేసులు బనాయించి తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించారని చెప్పారు.కావున నల్లపాడు పోలీసులు నిజ నిజాలు తెలుసుకుని తన స్థలమును తనకు ఇప్పించవలసినదిగా ఆయన కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సయ్యద్, మైనార్టీ ఇంచార్జ్ అసరుద్దీన్, గుర్రం రామారావు, ఎస్ కే జానీ బేగం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *