Breaking News

కార్మిక లోకం సంక్షేమమే సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం

-మేడే శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కార్మికులు, కర్ష‌కులు, శ్రామికులు త‌మ శ్ర‌మ‌ను ధార‌పోస్తూ దేశ‌, రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వాములుగా ప‌ని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం. తిరిగి కార్మికుల, పేద‌ల‌ జీవితాల్లో వెలుగు నింపుతుంది. మేడే సంద‌ర్బంగా కార్మిక‌, శ్రామిక,క‌ర్ష‌క లోకానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

‘‘కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యం. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంది .ఉచిత ఇసుక‌విధానాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చి కార్మికుల‌కి అండ‌గా నిల‌బ‌డింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అలాగే రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం ఆర్థికంగా వృద్ది సాధించేందుకు కుటుంబానికో పారిశ్రామిక‌వేత్త‌గా వుండాల‌న్న ఆశ‌యంతో సీఎం చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. అలాగే స‌మాజంలో పేద‌రికాన్ని స‌మూలంగా నిర్మూలించాల‌నే ల‌క్ష్యంగా సీఎం చంద్ర‌బాబు చేప‌ట్టిన పీ4 విధానం పేదలు, కార్మికుల కుటుంబాల‌కు చేయూతగా మారింది.

పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు ..అయితే గ‌త ఐదేళ్ల దుర్గ్మార్గ పాల‌న‌లో రాష్ట్రం ప్ర‌గ‌తికి దూర‌మైంది. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ప‌దినెలల్లో రాష్ట్రంలో ప‌లు పరిశ్రమల స్థాపనతో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ.. తిరిగి కార్మికుల, పేద‌ల‌ జీవితాల్లో వెలుగు కిర‌ణాలు ప్ర‌స‌రిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్మిక లోకానికి అండ‌గా వుంటుంది”. అని ఎంపి కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *