Breaking News

రాయితీతో పన్ను వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ

-ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ, అడ్వాన్స్ ట్యాక్స్ పై 5 శాతం రాయితీతో పన్ను వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించిన గుంటూరు నగరపాలక సంస్థ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి పన్నువడ్డీపై 50 శాతం రాయితీ, అడ్వాన్స్ ట్యాక్స్ పై 5శాతం రాయితీతో పన్ను వసూళ్ళలో గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 30 తేదీ నాటికి రూ.55.57 కోట్లతో రికార్డ్ సాధించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీపై, అడ్వాన్స్ ట్యాక్స్ పై రాయితీలు ప్రకటనను నగరంలో 52,680 మంది, గతేడాది కంటే 25 శాతం మంది అధికంగా సద్వినియోగం అభినందనీయమన్నారు. ఏప్రిల్ నెలలో రెవెన్యూ వసూళ్ళలో ఆస్తి పన్ను రూ.52.31 కోట్లు, ఖాళీ స్థల పన్ను రూ.3.26 కోట్లు వసూళ్ళు జరిగిందన్నారు. గతేడాది 45,542 మంది రూ.44.45 కోట్లు పన్ను చెల్లించారన్నారు. గతేడాదికి మించి ఏ ఏడాది రూ.11 కోట్లు అధికంగా పన్ను వసూళ్లు చేసిన అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, అదనపు కమిషనర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *