Breaking News

ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి నరేంద్రమోడి రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి వస్తున్న సందర్బంగా ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఆర్యవైర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ తో కలిసి ఆమె…ప్రధాని సహా ముఖ్య అతిథులు ఆశీనులయ్యే వేదికతో పాటు సభికుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించారు. పనులు ఎంతమేరకు జరిగాయని నిర్వాహాకులను అడిగి తెలుసుకున్నారు. అయిదు లక్షలకు పైగా సభికులు తరలొస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని, తాగునీరు, నీడ కల్పించేలా టెంట్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన వేదిక ఏర్పాట్లలో మంత్రి సవిత పలు సూచనలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *