-అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి శుభాకాంక్షలు
-రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని , రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆలు పెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ‘మే డే’ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతాయని చెప్పారు.వారికి శుభం చేకూరాలని మనసారా
ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.
Prajavartha Online Telugu News