గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 2న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు కేటాయించిన పార్కింగ్, మెయిన్ డయాస్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం అమరావతిలో విధులు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణంలో ప్రధాన వేదిక, వివిఐపి వేదిక మరియు కల్చరల్ వేదికల వద్ద ప్రధాని పర్యటన ముగిసే వరకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టేలా కార్యదర్శులను, కార్మికులను కేటాయించామన్నారు. చెత్త సేకరణకు డస్ట్ బిన్లు, డంపర్ బిన్లు, కాంపాక్టర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే పార్కింగ్, ఇతర ప్రాంతాల్లో షుమారు 6 వందల మొబైల్ టాయ్ లెట్స్ ని ఏర్పాటు చేసి, వాటికి అవసరమైన నీటి వసతి కల్పనకు ఇంజినీరింగ్ అధికారులను కేటాయించామని తెలిపారు. ప్రధాని పర్యటన విజయవంతంలో జిఎంసి సిబ్బంది తమకు కేటాయించిన విధులను శ్రద్ధగా నిర్వహించాలని, పనులనుం డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల్లో ఉండే కార్మికులు, సిబ్బందికి ఆహారం, త్రాగునీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News