Breaking News

టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా వుంటుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-పెనుమ‌త్స‌ వ‌ర్మ జ‌యంతి అన్న‌దాన కార్య‌క్ర‌మం
-నివాళుల‌ర్పించిన ఎంపి కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ కి కార్య‌క‌ర్త‌లే ఆస్తి.. కార్య‌కర్త‌ల‌కు ఏలాంటి క‌ష్టం వ‌చ్చినా పార్టీ తోపాటు నాయకులు అంద‌రూ అండ‌గా వుంటార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. టిడిపి యువ‌నాయ‌కుడు పెనుమ‌త్స వ‌ర్మ 33వ జ‌యంతి వేడుక‌లు భవానీపురంలోని శివాల‌యం సెంట‌ర్ లో వ‌ర్మ ప్రెండ్ స‌ర్కిల్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ముందుగా పెనుమ‌త్స వ‌ర్మ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ వ‌ర్మ ప్రెండ్స్ స‌ర్కిల్ చేప‌ట్టే సేవ కార్య‌క్ర‌మాలు అండ‌గా వుంటాన‌న్నారు. వ‌ర్మ ను మ‌ర్చిపోకుండా వ‌ర్మ ప్రెండ్స్ అంద‌రూ క‌లిసి జ‌యంతి కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌టం ఆనందంగా వుంద‌న్నారు. ఆతర్వాత బుద్దావెంక‌న్న మాట్లాడుతూ వ‌ర్మ చాలా నిబ‌ద్ద‌త క్ర‌మ‌శిక్ష‌ణ తో పార్టీకి ప‌నిచేసేవాడ‌ని కొనియాడారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రు మ‌ర్చిపోలేరన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, మాజీ కార్పొరేట‌ర్ ప‌త్తి నాగేశ్వ‌ర‌రావు, టిడిపి యువ‌నాయ‌కుడు శివా రెడ్డి, జ‌న‌సేన సెంట్ర‌ల్ ఆంధ్రా జోన్ కో క‌న్వీన‌ర్ కొప్పిరెడ్డి ఎస్.ఎన్.మూర్తి ల‌తో పాటు వ‌ర్మ ప్రెండ్స్ స‌ర్కిల్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *