Breaking News

రాష్ట్రానికి ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తీర్చిదిద్ద‌టమే ఎన్డీయే కూటమి లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్

-తిరువూరు వేముల హేమ‌ల‌త రూ.3లక్షల ఎల్.వో.సి మంజూరు
-బాధితురాలు తండ్రికి రూ.3లక్షల ఎల్.వో.సి అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రజలందరీ సంక్షేమం,అభివృద్ధితో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా ఎన్డీయే కూటమి లక్ష్యమని..ఆ విధంగానే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తిరువూరు టౌన్ 5వార్డ్ అధ్య‌క్షుడు వేముల ఏడుకొండ‌లు త‌న కుమార్తె వేముల హేమ‌ల‌త వైద్య చికిత్స నిమిత్తం త‌క్ష‌ణ ఆర్థిక సాయంకై లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ కోసం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సాయంతో ఆర్టీ పెట్టుకున్నారు. మంజూరైన రూ.3 ల‌క్ష‌లరూపాయ‌ల ఎల్.వో.సి ప‌త్రాన్ని వేముల ఏడుకొండ‌లకు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎంపి కేశినేని శివనాథ్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్ తో కలిసి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువ‌త అధికార ప్ర‌తినిధి మాద‌ల హ‌రిచ‌ర‌ణ్ (కిట్టు), తిరువూరు ప‌ట్ట‌ణ 15వ వార్డ్ అధ్యక్షుడు మ‌ల్లెల శ్రీనివాస‌రావు, తిరువూరు తెలుగు యువ‌త ఉపాధ్య‌క్షుడు షేక్ హుస్సెన్, తెలుగు దేశం నాయ‌కులు వేముల చ‌క్ర‌వ‌ర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *