Breaking News

సమన్వయ శాఖల అధికారుల తో సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో శుక్రవారం జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభకు జిల్లా నుంచి వివిధ వర్గాలు ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో సమన్వయ శాఖల అధికారుల తో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాకి చెందిన ప్రజలు, వివిధ పథకాల ప్రయోజనం పొందిన లబ్ధిదారులు ప్రధాని కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ పై సమీక్ష నిర్వహించి, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలు , లబ్దిదారులు తరలి వెళుతున్న బస్సులలో మంచి నీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సుల గమనాన్ని ట్రాక్ చేయాలని చెప్పారు. శ్రీకాకుళం నుంచి వస్తున్న వారికి రాజమహేంద్రవరం లో తగిన తాత్కాలిక వసతులు, సహకారం అందించాలని చెప్పారు. ప్రధాని కార్యక్రమానికి హాజరై, తిరిగి వచ్చేవరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, డ్వామా పిడి ఎమ్. నాగమల్లేశ్వర రావు, డిఆర్డిఏ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (జేడి) ఎల్. అప్పలకొండ , డిఎల్డిఓ పి వీణాదేవి, ఏ . స్లీవా రెడ్డి, ఆర్టీవో (రవాణా) ఆర్. సురేష్, డిపిఆర్వో బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *