Breaking News

ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయుచున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పరిశీలించారు.ప్రధాన సభా వేదిక,ఫైలాన్,పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమానికి బస్సుల్లో వస్తున్న ప్రజలకు అల్పాహారం, తాగునీరు,మధ్యాహ్న భోజనం,రాత్రి భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం సిఎస్ విజయానంద్ శరవేగంగా జరుగుతున్నఏర్పాట్లపై అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,పియం పర్యటన ఏర్పాట్ల రాష్ట్ర నోడలు అధికారి జి.వీరపాండ్యన్,గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *