Breaking News

నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉపాధి అవకాశాలు

-ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు దరఖాస్తు చేసుకునేందుకు
-జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉద్యోగా అవకాశాలు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంలో ప్లేస్మెంట్ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. పేర్లు నమోదు కోసం మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియ చేశారు. ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాలు (పనిచేసే నగరం) కోసం వాటికి సంబంధించి పేర్కొన్న అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

1. ఇన్స్టలేషన్ టెక్నీషియన్ (లారిసా ) కోసం అర్హత ఐ టి ఐ ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్ , అనుభవం: కనీసం 2 సంవత్సరాలు వేతనం 830 యూరోలు ( రూ.180,000/-) పని గంటలు: సోమవారం నుంచి శుక్రవారం, రోజుకు 8 గంటలు

2. ప్లంబింగ్, సీవేజ్, ఫైర్ ఫైటింగ్ (గ్రీస్): ఐ టి ఐ ప్లంబర్ అనుభవం: కనీసం 10 సంవత్సరాలు, వేతనం 900 యూరోలు (రూ.187,000/-) పని రోజులు: వారం 6 రోజులు, (రోజుకు 1 గంట ఓవర్ టైమ్ తో)

3. కన్స్ట్రక్షన్ హెల్పేర్స్ – నిర్మాణ రంగం కార్మికులు (ఏథెన్స్ గ్రీస్): అర్హత: ప్రత్యేక విద్యార్హత అవసరం లేదు, అనుభవం: కనీసం 5 సంవత్సరాలు , వేతనం 850 యూరోస్ ( రూ.182,000/-) పని రోజులు: వారం 5 రోజులు, 40 గంటలు

పేరు నమోదు కోసం మే 10 లోగా https://naipunyam.ap.gov.in/program-registration లేదా skillinternational@apssdc.in email కు వివరాలు తెలియ చెయ్యాల్సి ఉంటుందన్నారు.

ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి కలుగ చేసే ప్రయోజనాలు ఉచిత నివాసం మరియు రవాణా: హెల్త్ ఇన్సూరెన్స్ మరియు సోషియల్ సెక్యూరిటీ అందుబాటులో , గ్రీక్ చట్టం ప్రకారం సెలవులు (Plumbing post కి మాత్రమే)

ఈ అవకాశాలను యువత గమనించి, తమ అర్హతలకు అనుగుణంగా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి వి.డి.జి.మురళి కోరారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 లను కార్యాలయ పని సమయంలో సంప్రదించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *