Breaking News

రబీలో పండించిన ధాన్యం మొత్తాన్ని జాప్యం లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూలపాడు, పైడూరుపాడు, కొత్తూరుతాడేపల్లి,నున్న, కవులూరు తదితర గ్రామాల్లో రబీలో పండించిన ధాన్యం మొత్తాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలరోజులైనా ఇప్పటికీ ధాన్య కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం లేదని జిల్లాలో అనేక గ్రామంలో వేలాది టన్నులు ధాన్యం కల్లాల్లో, సంచలలలో నింపి ఉందని ఈ ధాన్యాన్ని మొత్తం వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పి.జమలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పి.వెంకటేశ్వరరావు, బోగేశ్వరావు, నాగరాజు, సుబ్బారావు మురళి తదితర ప్రతినిధి బృందం యన్ టి ఆర్ జిల్లా సివిల్ సప్లై జిల్లా మేనేజర్, డిప్యూటీ కలెక్టర్ సతీష్ ను విజయవాడ ఆఫీసులో కలిసి వినతిపత్రం అందజేశారు.ధాన్యం నింపడానికి సంచులు ఇవ్వటం లేదని, కొంతమందికి సంచులు ఇచ్చినప్పటికీ కాటా వేసే హమాలీల కొరత ఉందని, కొన్ని గ్రామాల్లో సంచులు ఇచ్చి, కాటా వేసినప్పటికి లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఒకటో రెండో లారీలు వచ్చినా బ్యాంకు గ్యారెంటీలు అయిపోయాయని ఏ మిల్లులకు పంపాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని కొనుగోలు కేంద్రంలో అధికారులే రైతులకు చెబుతున్నరన్నారు.
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో కల్లాల్లో, పొల్లాల్లో 15లోడుల ధాన్యం ఉంటుందన్నారు.పైడూరుపాడులో రెండు లోడులు, జి. కొండూరు మండలం కవులూరులో 15 లోడులు, విజయవాడ రూరల్ మండలం కొత్తూరుతాడేపల్లిలో రెండు లోడులు, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 15 లారీల ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు.
చాలా గ్రామాల్లో కల్లాల నుంచి మిల్లర్లు దగ్గరికి వెళ్లిన ధాన్యాన్ని లారీల నుండి వెంటనే దించుకోవడం లేదని, రోజుల తరబడి ఆలశ్యం చేస్తున్నారని విన్నవించారు. తేమ శాతం ఎక్కువ ఉందని లేదా ఓవర్ డ్రై అయిందని,
ముక్కవుతుందని క్వింటాకు 5 కేజీలు చొప్పున తరుగుదల తీసుకుంటున్నారు లేదా దాని సరిపడా డబ్బులు వసూలు చేస్తూ మిల్లు యాజమన్యాలు దోపిడీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రైతుల బాధలను వివరించారు.
కొనుగోలు కేంద్రాలు సహాకరించక పోవడంతో రైతులే సొంతంగా పెట్టుకున్న లారీలకైతే టన్నుకు రూ.650లు కిరాయిలు వసూళ్లు చేస్తున్నారు.మిల్లుల వద్ద ధాన్యం దించుకోవడం ఆలశ్యం ఐతే వెయిటింగ్ కి కిరాయల భారం రైతులపై పడుతుందన్నారు.
సంచులలో నింపడం, కాటా వేయడం,లారీలకు ఎక్కించడం కూడా చాలా ప్రాంతాల్లో రైతులే ఏర్పాటు చేసుకోవడం వలన 41కేజీల టిక్కీకు 22 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్వింటాకు రూ.17. 17లు,లారీల కిరాయిలకు రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.300లు ఇస్తుంది.రైతుల ఏర్పాటు చేసుకుంటే టన్నుకు రూ. 650 చొప్పున లారీ యజమానులు. వసూలు చేస్తున్నారు. ఈ విధంగా అదనపు భారం రైతాంగంపై పడుతుందన రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ఆలశ్యం అయ్యే కొద్ది అకాల వర్షాలు,ఈదురు గాలుల వల్ల ధాన్యం తడిసిపోతుందని , ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి అవసరమైన వసతులు, పట్టాలు లేవని దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, రైతుల దగ్గర ఉన్న ధాన్యానికి సరిపడా సంచులు వెంటనే ఇవ్వాలని, కాటా వేయడం, లారీకు లోడు చేయడానికి అవసరమైన హమాలీలను ఏర్పాటు చేయాలని, మిల్లు దగ్గరకు వచ్చిన లారీల నుండి వెంటనే ధాన్యాన్ని దించుకునే విధంగా చర్యలు చేపట్టాలని,మిల్లర్ల అక్రమాలకు అవినీతికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *