విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ చింతారవి బాల కృష్ణ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించే కూచిపూడి రంగ ప్రవేశ ఉత్సవాలు సోమవారం ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా భువనసాయి లలిత నృత్యరంగ ప్రవేశంలో భాగంగా నాటరాగంలో నర్తనగణపతితో ప్రారంభించి, శివస్తుతి చిదంబరీ, స్తవం, పదము నగుమోము, ధిల్లానా అంశాలను ప్రదర్శించింది. నాట్యాచార్యులు హరిరామమూర్తి, సీహెచ్ శ్రీనివాస్, సంతోష్, నండూరి శంకర కోటేశ్వరరావు సంగీత విద్వాంసులు పోపూరి గౌరీనాధ్ ఆత్మీయంగా సత్కరించారు. డాక్టర్ చింతారవి బాల కృష్ణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భారతీయ నృత్య సంప్రదాయలను పరిరక్షించుకోవాలని కూచిపూడి నృత్య సంప్రదాయంలో రంగప్రవేశం ప్రధాన మైదని తెలిపారు. మోతుకూరి, మోతుకూరి రాంబాబు, లక్ష్మీశైలజ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News