విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తులు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలూకా సుమారు 3200 కోట్లకు పైగా నిధులు మధ్యం కంపెనీలనుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా సేకరించారు అన్న ఆరోపణలు వచ్చిన పరిస్థితుల మీద విచారణ చేస్తున్న సీట్ నివేదిక ప్రకారం కొత్త మద్యం విధానం వలన లబ్ది పొందిన మద్యం కంపెనీలనుంచి కిక్ బ్యాక్ ల ద్వారా వచ్చిన అవినీతి డబ్బును డొల్ల కంపెనీల ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్లో పెట్టడం జరిగిందన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై విచారణ జరుగుతున్న సమయంలో, చిన్ని కుటుంబ సభ్యులు, కాసిరెడ్డి కలిసి “ప్రైడ్ ఇన్ఫ్రా ప్రి ఎల్ఎల్బి” అనే కంపెనీ గతంలో ప్రారంభించిన విషయం బయటకి వచ్చిందని అన్నారు. 3200 కోట్లు సంబంధించి డబ్బులను సేకరించే పరిస్థితిలో కసిరెడ్డి అలాగే టిడిపి నాయకుడు అయి ఉండి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో కలిసి వ్యాపారం చేసే పరిస్థితులలో కేశినేని చిన్ని ఉన్నారా అని ప్రశ్నించారు. వీళ్లిద్దరు కూడా బినామీలే వీళ్ళ మీద బినామీ చట్టం ఉపయోగించి వీళ్ళిద్దరి వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని కూడా సోషల్ మీడియాలో వెల్లడించినట్లు తెలిపారు. అలాగే నాని, మరిన్ని డొల్ల కంపెనీల వివరాలను కూడా బయటపెట్టారని అన్నారు. ఈ స్థితిలో టీడీపీ నాయకత్వం చిన్ని పై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్ని పై ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్తో త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. మద్యం కుంభకోణంలో మని ల్యాండ రింగ్ దాగుం దన్నారు. దీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News