ప్రభుత్వ పాఠశాలలో చదివిన 22 మంది విద్యార్థులను సత్కరించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, మున్సిపల్ కమిషనర్

-కలల్ని సాకారం చేసుకోవడం కోసం దగ్గర దారులు ఉండవు
-నిరంతర అభ్యసం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యం
-విద్యార్థులు, వారి తల్లితండ్రులతో కలిసి విందులో పాల్గొన్న అధికారులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వతంత్రంగా ఉండాలి, మన ఆశయాలను సాకారం కావడం కోసం కష్టపడి ఇష్టంగా మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించే పట్టుదల కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నా జీవితంలో ఎందరినో రోల్ మోడల్ గా చేసుకుని, నేను చివరిగా అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. అయితే తనకు వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ఎందరో వ్యక్తులు ప్రభావం తనపై ప్రభావం చూపిందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రేరణ పొంది వాటి నుంచి విజయం సాధించడం ద్వారా మాత్రమే కలలు సాకారం అవుతాయని తెలిపారు. ఆనంద , విషాద సందర్భాలు కూడా లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ పొందే సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉంటుందని తెలియ చేశారు. వాటి నుంచి ప్రేరణ పొందాలని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత రత్న డా బిఆర్ అంబేడ్కర్ జీవితం ఒక మంచి ఉదాహరణ అన్నారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో తనకు ఎదురైన వివక్ష నుంచి ప్రేరణ పొందడం, భారత దేశ స్వతంత్రం కోసం పోరాడడం మనకు తెలుసన్నారు. ఎస్పీ డి నరసింహా కిషోర్ మాట్లాడుతూ, కలలను సాకారం చేసుకోవడం , అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం కష్ట పడితే ఫలితం ఉంటుందనీ పేర్కొన్నారు. విజయానికి దగ్గర దారులు ఉండవని, అందుకోసం నిరంతర శ్రమ, అభ్యసం ఉండాలన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, తన నేపథ్యం ఒక పూటకు ఆహారం కోసం ఎదురుచూసే కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. పేద వర్గాల కుటుంబం నుంచి వచ్చిన వారిలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలనే లక్ష్యం ఉంటుందని తెలియ చేశారు. నేడు ప్రభుత్వ జెడ్పీ /ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, ఇంత ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి స్పూర్తి కలిగిస్తోందని అన్నారు. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు దగ్గర మార్గాలు ఉండవని, కష్ట పడితే ఫలితం ఉంటుందనీ తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న పిల్లలు మెరుగైన మార్కులు సాధించి తమ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడం జరిగిందని తెలిపారు.. ఇదీ ప్రారంభం మాత్రమే అని,  కలలను సాకారం చేసుకోవడం కోసం మరింత చక్కగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. నేను ఎనిమిది రకాల ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడం జరిగిందనీ, ఎప్పుడు ఐ ఎ ఎస్ అవుతానని అనుకోలేదన్నారు. ఎంత మంది నుంచి ప్రేరణ పొందడం, నిరంతర శ్రమ అభ్యసం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో 580 పైగా మార్పులు సాధించిన 22 మంది విద్యార్థి నీ,విద్యార్థులను కలెక్టర్ తదితరులు అభినందించారు.

వారి వివరాలు
Z P బాలుర ఉన్నత పాఠశాల, అనపర్తి సత్తి కొండా రెడ్డి 592 , ZP ఉన్నత పాఠశాల, మురమండ పొలోతు భవ్య శ్రీదేవి 591 , ZP ఉన్నత పాఠశాల కుతుకులూరు కర్రి సంజీవ రెడ్డి 587 , ప్రభుత్వ మోడల్ హై స్కూల్, (బి) రాజమండ్రి కుడిపూడి ధయకర్ 587 , Z P బాలికల ఉన్నత పాఠశాల ధవళేశ్వరం దిండి దీపిక 585 , సిటీ MPL హై స్కూల్, రాజమండ్రి కోన గోపిక 585 , Z P బాలికల ఉన్నత పాఠశాల అనపర్తి గుత్తుల ప్రసన్న సత్య 584 , హై స్కూల్ కొంతమూరు కోమలి జేతవ్య బాల శ్రీ 584 , GPR ZPHS బొమ్మూరు కాసాని జగదీష్ 584 , ZPHS సాటిలైట్ సిటీ మిరియాల జై సందీప్ 584 , Z P బాలికల ఉన్నత పాఠశాల అనపర్తి వోగిరెడ్డి శ్రీ సత్యసాయి 583 , ఆంధ్రా నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ రాజమండ్రి చుక్కా శ్రీచరణ్ ప్రకాష్ 583 , CJRM MPL ఉన్నత పాఠశాల రాజమండ్రి మావూరు హేమంత్ రావు 583 , Z P ఉన్నత పాఠశాల, వడిసలేరు అత్కూరి లక్ష్మీ ప్రియాంకర్ 583 , ZP ఉన్నత పాఠశాల, బిక్కవోలు దాసరి జయ మణి మంగా 582 , SBGRZPP ఉన్నత పాఠశాల యెర్నగూడెం మనే తనుశ్రీ పోలా శేష సాయి దుర్గా 582 , ZP ఉన్నత పాఠశాల మాధవ రాయుడుపాలెం పి . లీలా మేఘన 581 , MPL CORPN. హై స్కూల్, గాంధీపురం చల్లా లాస్య ప్రియ 581 , Z P బాలికల ఉన్నత పాఠశాల, అనపర్తి పాళీ దేవి సత్య శ్రీ 581 , Z P బాలికల ఉన్నత పాఠశాల అనపర్తి నరవ కీర్తన 581 , సిటీ MPL హై స్కూల్, రాజమండ్రి పాలవలస సుప్రియ 581 , ZP ఉన్నత పాఠశాల, రంగంపేట కోసెట్టి శ్యామ్ కుమార్ 581.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *