-అన్ని జిల్లాల కలెక్టర్ లు ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించండి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో పౌర రక్షణ చర్యలను బలోపేతం చేసేలా కలెక్టరు లు జిల్లాలో ముందస్తుగా భద్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లను పోలీసు, రెవెన్యూ, భద్రతా, అత్యవసరసేవా, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుండి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంశంపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కు నిర్వహించగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డి ఆర్ ఓ నరసింహులు పాల్గొన్నారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన సివిల్ డిఫెన్స్ రూల్స్ ప్రకారం జిల్లాలో పౌర రక్షణకై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, ఫైర్, మెడికల్, మొదలైన ఎమర్జెన్సీ సర్వీసులు, ఇతర అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రత్యేకించి జిల్లాలోని జీజీహెచ్, ఏరియా, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో సమన్వయం చేసుకుని అన్ని రకాల అత్యవసర చికిత్సలు, మందులను, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.
ప్రధానంగా జిల్లాలో ఉన్న విద్యుత్, ఇంధన, అణు ఉత్పాదక సంస్థలు, కర్మాగారాలైన ఆర్టిపిపి, పవర్ గ్రిడ్, ఐఒసీఎల్, హెచ్పిసీఎల్, యూసీఐఎల్ తదితర సంస్థల్లో ఖచ్చితంగా పౌర భద్రతా ముందస్తు చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని జిలా కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు వారి పరిధిలోని మండలాల్లో ని సంబంధిత అధికారులతో కలసి పౌర రక్షణ ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. పెంపొందించాలన్నారు. అందులో భాగంగా చేపట్టే రిహార్సల్స్, మాక్ డ్రిల్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Prajavartha Online Telugu News