విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు వీలుగా గ్రామస్థాయి సంయుక్త తనిఖీ కమిటిని ఏర్పాటు చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఓవర్ హెడ్ ట్యాంక్ (OHSR) నుండి పైప్ లైన్ చివరివరకు నీటిసరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్థాయి సంయుక్త కమిటీ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా పైప్ లైన్ లీకేజీలు, రిపేర్లు, కొత్త పైప్ లైన్ వేయవలసిన అవసరాలు, సమీప మురుగునీటి డ్రైనేజిలో కలిసి ఉండే పైప్ లైన్లు, మంచినీటి వనరు మూలస్థానం వద్ద (సోర్సు) పరిశుభ్రత తదితర కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా గ్రామస్థాయి సంయుక్త తనిఖీ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీలో గ్రామ సర్పంచ్, ఇద్దరు వార్డ్ మెంబర్లు, జల్ జీవన్ మిషన్ మెంబరు, పంచాయితీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో కూడిన కమిటీ మూడు రోజులు గ్రామస్థాయిలో పైన పేర్కొన్న మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులను పూర్తి చేసి, వాటి లోని లోపాలను గుర్తించి త్రాగునీటి సరఫరా తనిఖి (Audit of Drinking Water Supply) అనే PR ONE అప్లికేషన్ టైల్ నందు నమోదు చేయాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశించడం జరిగిందన్నారు. ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి, డివిజనల్ పంచాయితీ అధికారి విజయవాడ, జిల్లా గ్రామ పంచాయితీ అధికారులను కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసినదిగా ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News