Breaking News

కోర్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20 నాటికి విభాగాల వారీగా వివిధ రకాల కోర్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్  తమ చాంబర్ లో కోర్ట్ కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై విభాగాధిపతులు, సూపరిండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్  తొలుత విభాగాల వారీగా ఉన్న కేసులు, తీర్పు వచ్చిన కేసులు, పెండింగ్ ఉన్నవి వివరాలు తీసుకొని, మాట్లాడుతూ వివిధ అంశాలపై ఆయా సంస్థలు, వ్యక్తులు ఫైల్ చేసిన కోర్ట్ కేసుల్లో ఎక్కువ శాతం పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయన్నారు. విభాగాధిపతులు కోర్ట్ కేసులపై ప్రతి రోజు విభాగ సూపరిండెంట్, సంబంధిత అధికారులతో సమీక్షించుకోవాలని, కేసుల్లో నగరపాలక సంస్థ నుండి తీసుకోవాల్సిన చర్యల్లో లోపం ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ పెట్టుకొని కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు, ప్యారావైజ్ రిమార్క్స్ వంటివి పూర్తీ చేయాలని, సోమవారం నుండి ప్రతి రోజు కేసుల పురోగతిపై సమీక్ష చేస్తామని తెలిపారు. అలాగే కొన్ని కేసులకు సంబంధించి కోర్ట్ లు ఇచ్చిన తీర్పులను అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపరిండెంట్లు, లీగల్ సెల్ సిబ్బంది సమన్వయంతో ప్రతి రోజు కోర్ట్ కేసుల పురోగతిపై తమకు నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, డిప్యూటీ సిటి ప్లానర్ సూరజ్ కుమార్, మేనేజర్ బాలాజీ బాష, విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *