విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళి నాయక్ కు శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) ఘనంగా నివాళులర్పించింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చెందిన మురళి నాయక్ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్ సైనికుల పాశవిక దాడిలో గురువారం వీర మరణం చెందడం యావత్ జాతి గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పేర్కొన్నారు. భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించి శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు చొరవ చూపాలని యూనియన్ నాయకులు కోరారు. తొలుత ఐజేయు కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, విజయవాడ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు, యూనియన్ నేతలు జీ రఘురాం, శివరామకృష్ణ, అహ్మద్ హుస్సేన్, జీవన్ కుమార్, రూపాని రత్నాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News