Breaking News

తెలుగు సైనికులు యుద్ధానికి సిద్ధం

-రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘo

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాకిస్థాన్ తో యుద్ధానికి ఆంధ్ర ప్రదేశ్ లోని మాజీ సైనికులు సిద్ధoగా ఉన్నారని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు మోటూరు శంకరరావు అన్నారు.గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ సైనికులు సంక్షేమ సంఘ అనుబంధ విభాగo శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సైనికులను యుద్ధభూమికి పంపించవలసిoదిగా ప్రధాని మోడీ ని కోరారు.దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు భారత రక్షణ శాఖతో చర్చించి యుద్ధభూమికి పంపించవలసిందిగా ఆయన కోరారు.ఆంధ్రప్రదేశ్ లోని 685 మండలాల్లో లక్షమంది మాజీ సైనికులున్నారని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐనంపూడి రత్న ప్రసాద్ తేలిపారు.ఇందులో 25 వేలమంది మాజీ సైనికులు పాకిస్థాన్ తో యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాక్షులు పుసులూరు లక్ష్మీనారాయణ మాట్లాడు తు భారత దేశం మీసం తిప్పిందని శత్రువులను పారద్రోలెందుకు పౌరుషం పరుగు తీస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సేక్రెటరి వాకా ఆదినారాయణ ఎo.చిన కొండల రావు తడితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *