-జమ్మవరం హైస్కూల్ మాజీ చైర్మన్ మంగళపూడి వెంకటేశ్వరరావు
-కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్
-మూడు రోజు పోటీపడ్డ ఆరు జట్లు
వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతంలోని క్రికెట్ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి తీసుకువచ్చేందుకు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు దోహదపడతాయి. కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు జమ్మవరం హైస్కూల్ మాజీ చైర్మన్ మంగళపూడి వెంకటేశ్వరరావు ధన్యవాదమలు తెలిపారు.
జమ్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో మూడు రోజు ఆదివారం మూడు మ్యాచులు జరిగాయి. ఈ మ్యాచులు వీక్షించేందుకు జమ్మవరం హైస్కూల్ మాజీ చైర్మన్ మంగళపూడి వెంకటేశ్వరరావు అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో మొత్తం 20 జట్లు పోటీ పడ్డాయని తెలిపారు. శుక్రవారం మూడు మ్యాచులు జరిగ్గా, శనివారం నాలుగు మ్యాచులు జరిగినట్లు తెలిపారు.
అలాగే గ్రామాల పరిపూర్ణ వికాసం కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ పంచాయతీ కార్యక్రమం కూడా ప్రజలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సలహాలు, సూచనలు,సహకారంతో పంచాయతీ చాంపియన్స్ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు గురించి తెలియజేయటంతోపాటు గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ టోర్నమెంట్ మూడు రోజు జరిగిన మొదటి మ్యాచ్ లో ఎమ్.ఎస్.కె యూత్ పోన్నవరం జట్టు పై కిషోర్ టీమ్ నందలూరు 12 పరుగుల తేడా విజయం అందుకుంది. ఇక రెండో మ్యాచ్ లో ఎన్.ఎఫ్.సి యూత్ జుజ్జూరు జట్టు వెల్లంకి వారియర్స్ జట్టు పై 26 పరుగుల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్ లో ఎ.ఎమ్.సి.సి 2 అల్లూరు జట్టు పై యువసేన ఓల్డ్ జమ్మవరం జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ ఛాంపియన్స్ యర్రంరెడ్డి ప్రదీప్ కుమార్ ,కట్టా సునీల్ , సింగి సురేష్ ,కొప్పుల రాము, ఆవులదొడ్డి హనుమంతరావు, కారం శీను, జమ్మవరం బోడవాడ గ్రామ నాయకులు క్రికెట్ అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని క్రికెట్ మ్యాచులు వీక్షించారు.
Prajavartha Online Telugu News