-కేవలం 9 నెలల్లో 332 మందికి గాను చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు సుమారు రూ,3 కోట్లు అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
-మెరుగైన వైద్యం కోసం రూ.53 లక్షల ఎల్ వో సి మంజూరు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో కేవలం 9 నెలల్లో ముఖ్యమంత్రి సహాయనిది నుండి 332 మందికి గాను 2,46,69,602,కోట్లు అందించినట్లు మంత్రి అన్నారు,304 మందికి 1,94,22,029, కోట్లు, మరియు 28 మందికి గాను ఎల్, ఓ, సి, రూ, 52,47,573,లక్షలు అందించామని తెలిపారు,ఆనారోగ్యంతో బాధపడుతున్నావారి కుటుంబాలకు చికిత్స కోసం ఆర్ధికసహాయం కోసం కుటుంబసభ్యులు మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్, ఓ, సి, లు, రూ,52,46,68,602 లక్షల రూపాయల ఎల్ వో సి మంజూరు పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
మరియు వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిది నుండి సుమారు రూ,2 కోట్లు చెక్కులు బాధితులకు అందించమన్నారు, ఈ సందర్భంగా ఎల్‌ఓసిని మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి,ముఖ్యమంత్రి సహాయ నిధినుండి చెక్కులు అందుకొన్న బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారన్నారు, గత ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కూటమి ప్రభుత్వం పేదల వైద్యం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యపరికరాలు,నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని పేద ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు,అంతే కాక గతంలో వైద్యం చేయించుకున్న మెడికల్ బిల్స్ ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సహాయం అందిస్తానని నేరుగా నన్ను కలిసి ఆర్ధిక సహాయం పొందవచ్చు అన్నారు, వైద్యం కోసం ఎమర్జెన్సీ సమయంలో నేరుగా నాతో మాట్లాడి ప్రభుత్వం నుండి మెరుగైన వైద్య సేవలు పొందాలని మంత్రి తెలిపారు,ఏ ఒక్క పేదవాడు డబ్భులు లేక మెరుగైన వైద్యానికి దూరం కకూడదనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు,
Prajavartha Online Telugu News