మే14 న పొగాకు కొనుగోలు సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బర్లీ పొగాకు కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని మే 14వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో కొనుగోలు సమీక్ష సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యస్వంత్, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు హజరవుతారని ఈ సమావేశంలో రైతులు,రైతు సంఘాల నాయకులు పాల్గోని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్యలు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల 29వ తేదీన గుంటూరు లాంలో జరిగిన పొగాకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల సమావేశంలో వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎటువంటి జాప్యం లేకుండా గత సంవత్సరం చెల్లించిన ధరలకే బర్లీ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని ఇచ్చిన ఆదేశాలను కంపెనీలు పెడచెవిన పెడుతున్నాయన్నారు. పొగాకు కొనుగోలు చేయ్యకపోవడం వల్ల అప్పులు పెరిగిపోయి ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితులలో మానసిక ఆవేదనకు గురై బర్లీ సాగు చేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి ప్రభుత్వమే భాద్యత వహించాలన్నారు. పొగాకును వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించుకోబోతున్నామని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *