Breaking News

మైలవరం నియోజకవర్గం రాష్ట్ర, దేశీయ క్రీడలకు ప్రాంగణం కానుంది: ఎంపీ కేశినేని శివనాథ్

-లక్కి రెడ్డి హనిమి రెడ్డి గ్రౌండ్ లో వసంత సమ్మర్ ఉమ్మడి కృష్ణాజిల్లా కబడ్డీ టోర్నమెంట్-2025
-టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే లు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు
-చెవుటూరు, కుంటముక్కల గ్రామాల జట్లు మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని తిలకించిన ప్రజాప్రతినిధులు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు యువకుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గం రాష్ట్ర, దేశ క్రీడలకు ప్రాంగణం కానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
మైలవరం లోని లక్కి రెడ్డి హనిమి రెడ్డి గ్రౌండ్ లో వసంత సమ్మర్ ఉమ్మడి కృష్ణాజిల్లా కబడ్డీ టోర్నమెంట్-2025 ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే లు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం చెవుటూరు, కుంటముక్కల గ్రామాల చెట్లు మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ ని ప్రజాప్రతినిధులు తిలకించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచులు ఎంత జోరుగా సాగుతున్నాయో అదే స్పీడుతో కబాడీ టోర్నమెంట్స్ కూడా జరుగుతున్నాయన్నారు. రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ క్రీడలకు ప్రాంగణం కానుందని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోయే అమరావతి స్పోర్ట్స్ సిటీలో అన్ని క్రీడలకు సముచిత స్థానం ఉంటుందన్నారు.ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో క్రీడా పోటీలు నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే నందిగామలో కేశినేని ఫౌండేషన్ ద్వారా క్రికెట్ పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. మైలవరంలో కబాడీ పోటీలు జరుగుతున్నట్లుగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా క్రీడా పోటీలు మొదలయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటు ఏర్పాటు చేసిన లంక లతీష్ ను అభినందించారు. గ్రామీణ క్రీడలకు ఎప్పటికీ వాటి ప్రాధాన్యత తగ్గదన్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా క్రీడా పోటీలు ఏర్పాటుచేసి క్రీడలను ప్రోత్సహిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ ), టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ తో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *