Breaking News

అలివేలమ్మ తిరునాళ్ల మహోత్సవం పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
చందర్లపాడు గ్రామంలో జరుగుతున్న అలివేలమ్మ తిరుణాల మహోత్సవంలో lసోమవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి పాల్గొన్నారు.. అలివేలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరణాల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన చేయడానికి విచ్చేసిన జబర్దస్త్ టీంకు అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు గ్రామం శ్రేయస్సును కాపాడతారని, గ్రామస్తులకు సుఖసంతోషాలను అందిస్తారని తెలిపారు. ఆ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని అందరు సుఖసంతోషాలతో ఆయురార్యోగ్యలతో ఉండాలని అలివేలమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *