Breaking News

రాబోయే రోజుల్లో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి…

-జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఈ వేసవిలో రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యం. సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9 డి.ఎఫ్) మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడ దెబ్బకు గురి అవుతారని చెప్పారు. దీనినే ‘హీట్ స్ట్రోక్ లేదా ‘సన్ స్ట్రోక్ ‘అంటారని, ఇది ప్రమాదకరం, ప్రాణాంతకమని హెచ్చరిం చారు. వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కు వసేపు గురికావడం వలన చెమట పట్టి శరీ రంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోయి వడదెబ్బకు ఎక్కువగా గురవుతారని డాక్టర్ సుహాసిని తెలిపారు. వయస్సు 65 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకా లిక వ్యాధులతో భాదపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *