ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ పనిచేస్తుంది.

-వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన
-nhrc.net నేరుగా ఫిర్యాదులు చేసుకోవచ్చు
-జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకి అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపధ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు.

బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలోసంబంధిత శాఖల అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జిల్లా అధికారులు ఆమెను ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ భారతి సయాని మాట్లాడుతూ… ప్రజల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్ కు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం పరంగా అందించాల్సిన సేవలు విషయంలో కూడా కమిషన్ ను సంప్రదించ వచ్చని తెలిపారు. ఇప్ప టి వరకు 39 గిరిజన వసతి గృహాలు, ఎస్టి కాలనీలు, పాఠశాలలు, మండల తాహసీల్దార్ కార్యాలయాలలో ఆక స్మిక తనిఖీలు నిర్వహించి, వారి సమస్యల ను తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికై కమిషన్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పింఛన్లు అందక బాధపడుతున్న బాధితులకు పింఛన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని,మహిళల గౌరవానికి, భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను సుమోటోగా స్వీకరిస్తామని మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి తెలిపారు. ట్రైబల్ హాస్టల్స్, ఎస్టి కాలనీ లు, పాఠశాలలు, మండల తాహసీల్దార్ కార్యాలయాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నట్లు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే విషయం లో ప్రభుత్వ అధికారులు స్పందించక పోతే ఎన్ హెచ్ ఆర్ సి కి నేరు గా అర్జీలు పెట్టుకోవ చ్చని తెలిపారు. జాతీయ మానవ హక్కుల సంఘం స్వయం ప్రతిపత్తి సంఘం అని దీనికి ఏ రాష్ట్రం లోనూ అనుబంధ సంఘా లు లేవని స్పష్టం చేశారు. నేరుగా మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యలేని వ్యక్తులు ఆన్లైన్ ద్వారా nhrc.net నేరుగా ఫిర్యాదులు చేసుకోవచ్చు అని తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, కే.విజయ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే .ఎన్. జ్యోతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *