-16.05.2025 నుండి 1.06.2025 దరఖాస్తులు స్వీకరణ
-ఎమ్ ఎస్ శోభారాణి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
షెడ్యూల్డు కులాల, తెగల ప్రజలపై జరుగుతున్న అత్యాచార కేసుల పరిశీలన, నివారణ చర్యలు తూర్పు గోదావరి జిల్లా విజిలైన్సు మరియు మానీటరింగ్ కమిటీ ఏర్పాటుకు సంబందించిన SC/ST కులములకు చెందిన ఐదుగురు అనధికార సభ్యులను మరియు NGO (స్వచంద సేవా సంస్థల) తో అనుబందముగా పని చేయుచున్న SC/ST కాకుండా ఇతర కులముల నుండి ముగ్గురు సభ్యులను జిల్లా విజిలెన్స్ అండ్ పర్యవేక్షణ కమిటీ (డివిఎంసీ) ఎంపిక చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్ ఎస్ శోభారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ పూర్తి బయోడేటాతో పాటు, షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి చేసిన కృషకి సంబందించిన దృవ పత్రాలతో స్వీకరణ తేది 16.05.2025 నుండి 1.06.2025 తారిఖు సాయంత్రం 4 గంటల లోపు జిల్లా ఎస్.సి.సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జివో.నెం.99 ప్రకారం విజిలైన్సు మరియు మానిటరింగ్ కమిటీలో ప్రభుత్వేతర సభ్యులకు రెండుళ్ళు కాల పరిమితి ఉంటుందన్నారు. ఒక వ్యక్తి రెండు టెన్యూర్ లకు మించి సభ్యత్వం వహించే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News