గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాభివ్రుద్దికి సహకరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ని కోరారు. బుధవారం మంత్రిని ఉండవల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి, కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి, నగరాభివృద్ది పై చర్చించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగానంతంగా జరుగుతున్నాయని, గుంటూరు నగరంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు నగరం అమరావతి రాజధానిలో భాగంగా ఉన్నందున అభివృద్ధి పనులు వేగవంతంగా మరిన్ని కార్యాక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉందన్నారు. మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగరాభివ్రుద్దికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి మద్దతు ఉంటుందని, రాజధానిలో భాగమైన గుంటూరు నగరం కూడా అభివృద్ది పదంలో ముందుండాలని ప్రభుతం చేపట్టే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన మిత్ర యాప్ ద్వారా ప్రజలకు మెరుగైన మరియు త్వరితగతిన సేవల అందేలా చర్యలు తీసుకున్నామని, ఈ సేవలు ఇంకా ప్రజలకు చేరువ కావడానికి కృషి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం అందించే పధకాలు నిర్జమైన లబ్దిదారులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నవ వంశీ, విక్రమ్ పెద్ది, కన్నెగంటి బాలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News