Breaking News

ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఎలాంటి సందర్భంలో కూడా బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకూడదని ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులకు సూచించారు.

సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్రముని , ఆర్డిఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 190 పిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్లను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. మరో 24 గంటల్లో గడువు ముగిసే పిటీషన్లు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళకుండా ముందుగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. జిల్లా పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని , రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే సమస్యలపై ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని వివరించారు. 24 గంటలు , 48 గంటల్లో గడువు ముగిసే పిటీషన్లు పెండింగ్ లో వున్నందున జిల్లాల్లో సంతృప్తి స్థాయి శాతం ( Satisfaction percentage ) తగ్గిపోతుందని , పెండింగ్ లో వున్న ఐసిడీఎస్ , టిడ్కో , డీఆర్డీఏ శాఖలలో వున్న పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేసి సంతృప్తి స్థాయి శాతం పెంచాలన్నారు. పెండింగ్ లో వున్న కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. లోకాయుక్తా కేసులకు ఏమైనా పెండింగ్ లో వున్నాయా అని విచారించి , వున్న వాటికి కౌంటర్లు దాఖలు చేయాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జెడ్పి సిఇఓ జ్యోతిబసు , డ్వామా , డీఆర్డీఏ , హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు శంకర్, విజయలక్ష్మీ , ప్రసాద్ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , ఎస్.ఈ పంచాయితీ రాజ్ బ్రహ్మయ్య , డిఎస్ డబ్ల్యూ ఎస్ మోహన్ , జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు , జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర , జీయంసీ అసిస్టెంట్ కమిషనర్ వెంకట పూర్ణ , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , ఎల్ డి ఎం మహిపాల్ రెడ్డి తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *