-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షం పడుతున్న వేళ రోడ్ల పైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా యం జి రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మల స్కూల్ రోడ్డు, పినమనేని పాలిక్ లేని రోడ్డు, జమ్మి చెట్టు సెంటర్, లోయల కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్, కండ్రిక ప్రాంతాలన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షం వల్ల రోడ్ల పైన నీటి నిలువలు ఉన్న ప్రదేశాలన్నీ పర్యటించి తక్షణమే రోడ్డుపైన నీటి నిలువలు లేకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని, ఏమినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ సిబ్బంది వర్షపు నీరు ఉన్న రోడ్ల దగ్గర వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైన వాహనాలన్నీ ఉపయోగించి నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో గ్రేటింగ్ తీయించి వర్షపునీటి పారుదల నిరంతరంగా వెళ్లేటట్టు చూసుకోవాలని అన్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్లు పైన నీటి నిల్వలు ఎక్కడగా ఎక్కువ ఉంటాయో తెలుసుకోవటానికి తామే స్వయంగా నగరం మొత్తం పర్యటించి, అధికారులతో తాను గమనించిన ప్రతి ప్రాంతాన్ని అక్కడ నీటి నిల్వలు ఉన్నాయని తక్షణమే చర్యలు తీసుకోవాలని సిబ్బంది వెంటనే అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటూ నీటిని తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
కండ్రిక వద్ద నుండి 33 తూములు వరకు జరిగిన డీసిల్టింగ్ పనులను, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిశీలించి, ఔటఫాల్ డ్రైన్ లో ప్రవాహానికి ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News