-సైనిక సంక్షేమ నిధికి సహాయం సామాజిక భాధ్యత..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశం కోసం ఆహర్నిసలు సేవలు అందింస్తూ విధి నిర్వహణలో అటుపోట్లను ఎదుర్కొంటున్న సైనికుల సంక్షేమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని సైనిక సంక్షేమ నిధికి సహాయం అందించడం సామాజిక భాధ్యతగా భావించి విరాళం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
సైనిక సంక్షేమ నిధికి విరాళంగా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ప్రతినిధులు అందించిన లక్ష రూపాయల చెక్కును మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆయన ఛాంబర్‌నందు జిల్లా సైనిక సంక్షేమ అధికారి లెఫ్టనెంట్ కమాండర్ డా. కె. కళ్యాణ వీణకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఆహర్నిశలు పోరాడి అమర వీరులైన సైనిక కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ప్రతినిధులు సామాజిక భాధ్యతగా లక్ష రూపాయల విరాళాన్ని సైనిక సంక్షేమ నిధికి విరాళంగా అందించడం వారి దాతృత్వానికి నిదర్శనం అన్నారు. దేశ రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల ధైర్యసహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందన్నారు. ఇటివల పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా మన సైనికులు పోరాడిన తీరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు మనం స్వేచ్చంగా జీవించగలుగుతున్నామంటే అందుకు కారణం భారత సైనికుల రక్షణే కారణమన్నారు. దేశ రక్షణకి పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులకు, వితంతువు అయిన భార్యకు అనాదులైన పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి విరాళాలు అందించడం ద్వారా కొంత మేరకు లోటు తీర్చగలిగే అవకాశం ఉంటుందన్నారు. సైనిక సంక్షేమ నిధికి సహాయం అందించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికార సర్జస్ లెఫ్టనెంట్ కమాండర్ డా. కె. కళ్యాణ వీణ, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ జనరల్ మేనేజర్ కె.వి. మారుతిరావు, జిల్లా క్లస్టర్ హెడ్ టి. రామకృష్ణలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News