చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు

-కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగ జాతరలో పాల్గొని, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు

కుప్పం నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్దిపనులు అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా, ప్రజలకు అభివృద్ది ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సిఎం తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం బెంగుళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *