Breaking News

పాలస్తీనాకు అండగా ఉందాం

-పుస్తకావిష్కరణ సభలో వక్తలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇజ్రాయెల్ దురాక్రమణకు, వివక్షకు గురై, ప్రపంచ దేశాల మద్ధతు ఆశించిన స్థాయిలో అందని పాలస్తీనాకు యావత్తు ప్రపంచం మానవత్వంతో అండగా ఉండాలని కెఎల్ యు ఫ్రొఫెసర్ బుడిగ జమీందర్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు కూలీ సంఘం(ఏపి) రూపొందించిన పాలస్తీనా ముఖచిత్రం పుస్తకాన్ని పలువురు ఆవిష్కరించారు. అనంతరం పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ దురాక్రమణ, సొంత దేశంలోనే పాలస్తీనీయులు కాందిశీకులుగా, జీవచ్ఛవంబు వలె జీవించటాన్ని కన్నులకు కట్టినట్లు వివరించారు. రెండోవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల బారి నుంచి, ఫాసిస్టుల నుంచి రక్షణ పొందెందుకు ఆశ్రయం కోసం వచ్చిన యూదులు, ఏకంగా నీడ నిచ్చిన చెట్టునే దురాక్రమణ చేశారని ఇజ్రాయెల్ పై ధ్వజమెత్తారు. ఆమెరికా అండదండలతో, సామ్రాజ్యవాద దేశాల కనుసన్నలతోనే ఇజ్రాయెల్, పాలస్తీనాను నాశనం చేసిందన్నారు. మధ్య ఆసియా దేశాలలో తన పట్టు కోసం, సహజ వనరులు, సంపదను దోచుకునేందుకే ఆమెరికా ఇజ్రాయెల్ ని పెంచి పోషించిందన్నారు. ఒక సొంత దేశాన్ని, ఆ జాతిని, ఆ గడ్డను, భవిష్యత్ తరాలైన పిల్లలను హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసాహితీ అధ్యక్షులు దివి కుమార్ మాట్లాడుతూ ప్రపంచాన్ని శాసించే, యుద్ధాలను సృష్టించి, కనుసైగతో నిలుపుదల చేసే ఆమెరికా ఇజ్రాయెల్ గాజాపై చేసే దాడులను ఏందుకు నియంత్రించటం లేదని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ న్యాయస్థానాలు, అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దాడులను ఖండించిన, వ్యతిరేకించిన నేటికీ దురాక్రమణ దాడులు కోనసాగటానికి ఆమెరికా ప్రొద్భలమై ప్రధాన కారణమన్నారు. ఏపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వర ప్రసాద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని, సహజ వనరులు, సంపదను కొల్లగొట్టి కేవలం 10% భూభగంలో కూడా జీవించకుండా నిత్యం దాడులు, హింసకు గురి చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహించే ఆమెరికా, అదే తనకు నష్టదాయకమైన యుద్ధాన్ని తక్షణమే ఆపగలిగిన శక్తి కూడా అమెరికాకు ఉందని గుర్తించాలన్నారు. తాజాగా పాక్ ఇండియా యుద్ధాన్ని మనం చూశామన్నారు. మధ్య భారత దేశంలో జరిగే కగార్ ఆపరేషన్ ను మరి ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. అంటే అమెరికా ఆదేశాల మేరకే భారత పాలకవర్గాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఆదివాసిలను అంతం చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచ మార్కెట్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయని, యుద్ధాల అంతిమ దశ సామ్రాజ్యవాద కాంక్షనీ వివరించారు. దేశంలో ప్రతి రంగంపైన అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రభావం పడుతుందని, ఏక సామ్య మార్కెట్ శక్తులను ఎదుర్కోవటం కోసం, ప్రజానీకం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆలిండియా కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు మాట్లాడుతూ పాలస్తీనా కోసం ఏ గొంతు మాట్లాడని, ప్రశ్నించని సమయంలో రైతు కూలీ సంఘం వారి కోసం ఒక గొంతై మాట్లాడుతూ, పాలస్తీనాకు అండగా ఉండాలని ఒక చారిత్రక నేపథ్యం కలిగిన పుస్తకాన్ని రూపొందించటం గొప్పవిషయమన్నారు. వారికి మానవత్వంతో ప్రపంచ మానవాళి అండదండలు అందించాలని కోరారు. సభకు రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు యు. వీరబాబు అధ్యక్షత వహించారు. కార్యదర్శి యం. రాంబాబు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్ వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *