అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్నచర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈసమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు,పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులు(ఎటిఆర్)పై కమిటీ సమీక్షించింది.ఈసందర్భంగా పిఏసి కమిటీ చైర్మన్ పి.రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అంతేగాక పిఏసి కమిటీ సిపార్సులపై తీసుకున్న చర్యల నివేదికను కూడా సకాలంలో సమర్పించాలని సూచించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ శాఖల వారీ పెండింగ్ ఆడిట్ పేరాలు,ఎటిఆర్ లపై కమిటీ అధికారులతో సమీక్షించింది.
ఈసమావేశంలో కమిటీ సభ్యులైన ఎంఎల్ఏలు,ఎంల్సిలు విష్ణు కుమార్ రాజు,ఆరిమిల్లి రాధాకృష్ణ,నక్కా ఆనంద బాబు,అశోక్ రెడ్డి,కోళ్ళ లలిత కుమారి,ఆర్ శ్రీరామ్,అరుణ కుమార్ మొండితోక పాల్గొన్నారు.సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శరత్ చతుర్వేది, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సుష్మ రవిరాజ్,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర,అసెంబ్లీ ఉప కార్యదర్శి వణితా రాణి,వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,శాఖాధిపతులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News