Breaking News

ఫ్రైడే తో మలేరియా డెంగ్యూ దూరం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రై డే డ్రై డే పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, భాను నగర్ వద్ద ఫ్రై డే- డ్రై డే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి, వ్యాధుల సంక్రమణ పై అవగాహన కల్పించారు.

మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వ్యాధులు పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వ్యాప్తికి కారకాలైన దోమల ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు
మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.

కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు ,పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని సిబ్బంది అక్కడ ఉన్న ప్రజలకు తెలిపారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం దానిలో ప్రజలందరూ భాగస్వామ్యులు అవ్వడం ద్వారా మలేరియా , డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం సిద్ధంగా ఉండాలని అన్నారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్య నాయక్, అధికారులు, సిబ్బంది,హెల్త్ అసిస్టెంట్లు,ఏ.ఏన్.ఏమ్ లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *