Breaking News

సీఎం చంద్ర‌బాబు కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపెన్స్ క్ల‌స్ట‌ర్ హ‌బ్
-రెండు వేల ఎక‌రాలు కేటాయించిన సీఎం చంద్ర‌బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గాలల్లో ఢిపెన్స్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు కోసం రెండు వేల ఎక‌రాలు కేటాయించినందుకు సీఎం చంద్ర‌బాబు కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

డిఫెన్స్ క్ల‌స్ట‌ర్ హ‌బ్ రావ‌టం వ‌ల్ల ఎంతో మంది నిరుద్యోగ యువ‌త‌కి ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ ప్ర‌కారం యువ‌తకి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌టం కోసం రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు, ఐటి కంపెనీలు తీసుకురావ‌టానికి సీఎం చంద్ర‌బాబు,మంత్రి నారా లోకేష్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. ఔత్సాహిక ఎంట‌ర్ ప్రెన్యూర్స్ కు డిఫెన్స్ ప‌రిశ్ర‌మ రంగంలో అడుగుపెట్టెందుకు చ‌క్క‌ని స‌దావ‌కాశం ఏర్పడింద‌న్నారు. రాష్ట్రం పారిశ్రామ రంగంలో మ‌రో ముంద‌డుగు వేయ‌టానికి సీఎం చంద్ర‌బాబు బాట‌లు వేశార‌ని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా ప్ర‌జ‌ల త‌రుఫున‌, రాష్ట్ర ప్ర‌జ‌ల త‌రుఫున సీఎం చంద్ర‌బాబు కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *