Breaking News

రుయా ఆస్సుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆస్సుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సంబందిత వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరం నందు రుయా ఆసుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ , ఎక్విప్ మెంట్ పై సంబందిత వైద్య అధికారులతో సిటీ డయాగ్నస్టిక్ సెంటర్ కు కావాల్సిన ఎక్విప్ మెంట్ మరియు ఖర్చులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంకా అవసరమైన ఆసుపత్రికి కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయుటకు ప్రతిపాదనలను తయారుచేసి సమర్పించాలని , అలాగే సిటీ డయాగ్నొస్టిక్ సెంటర్ నందు ల్యాబ్ టెక్నీషియన్ డిప్యుటేషన్ పై విధులు కేటాయించవలసినదిగా తిరుపతి జిల్లా వైద్య అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ను ఆదేశించారు.

రుయా ఆసుపత్రి నందు 134 రక్త, మూత్ర, ఇతర ముఖ్యమైన పరీక్షలుకు గాను 60 టెస్టులు నిర్వహిస్తున్నామని ఇంకా 74 టెస్టులు పరీక్షలు నిర్వహించుటకు కావలసిన ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు . అందులో 15 టెస్టులకు సంబంధించి అదనంగా ఎక్విప్ మెంట్ కిట్ అవసరముందని తెలిపారు.

తిరుపతి పరిసర ప్రాంతాల్లో వున్న సుమారు 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే రోగులకు సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా ఈ సెంటర్ నందు చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రాధా, తిరుపతి జిల్లా వైద్యాధికారి డా.బాలకృష్ణ నాయక్, ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. జి.రవి ప్రభు, వైస్ ప్రిన్సిపల్స్, బయో కెమిస్ట్రీ,పెథాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ హెచ్ ఓడిలు మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *