యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాల జారీ

-www.yogandhra.ap.in లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా కార్యక్రమం పేర్లు నమోదు కు అవకాశం
-ఉత్తమ యోగా ప్రదర్శన సాధించిన వారు రాష్ట్ర స్థాయి కి ఎంపిక
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యం తో వివిధ స్థాయి లలో పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. యోగాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం లో రెండవదయిన “అమలు దశలో” మే 21 నుంచి జూన్ 15 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యోగాాంధ్ర ప్రచారంలో భాగంగా- గ్రామం/వార్డు/మండలం/జిల్లా స్థాయి వరకు చేపట్టడం కోసం వివిధ ఇతివృత్తాలతో కూడిన షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి 25 రోజుల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు చెప్పారు.

గ్రామం/వార్డు స్థాయి లో మే 26 -మే 30, 2025 వరకు అన్ని ప్రాథమిక స్థాయిల వారికి యోగా (యోగా ఫర్ ఆల్ గ్రాస్‌రూట్స్ వెల్నెస్) పై అవగాహన కల్పించడం, పేర్లు రిజిస్ట్రేషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. తదుపరి జూన్ 2 – 7, 2025 ” యోగా వారధి ద్వారా ఐక్యత” అంశంగా మండల స్థాయిలో సంఘాలతో కూడిన కార్యక్రమాలు ….

జూన్ 9 – 14, 2025 వరకు “యోగా మరియు యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడం” అంశంపై జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి లో నిర్వహించే రాష్ట్ర గ్రాండ్ ఫినాలే లో జూన్ 16 – 18, 2025) “యోగాంద్ర ఆంధ్ర -గ్లోబల్ యోగా షోకేస్” అంశంపై ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.

కేటగిరీ ల వారీగా –

వ్యక్తిగత స్థాయిలో లో ఆసన ప్రదర్శన (స్టాటిక్ మరియు డైనమిక్), సూర్య నమస్కార్ ఛాలెంజ్ , ప్రాణాయామ ప్రదర్శన , ధ్యానం ఓర్పు పై యోగభ్యాస పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సమూహ పనితీరు విధానం లో సింక్రొనైజ్డ్ గ్రూప్ యోగా & మిశ్రమ వయసు గ్రూప్ యోగా కార్యక్రమం ,

కళాత్మక యోగా పోటీ విభాగంలో యోగా పాట , యోగా పెయింటింగ్ , యోగా స్కిట్ మరియు రోల్ ప్లే విభాగాల్లో పోటీలు ,

నాలెడ్జ్ ఆధారిత పోటీలు విభాగంలో యోగా క్విజ్ , యోగా పోస్టర్ ఆవిష్కరణ , యోగా నినాదం, యోగా వ్యాసం ,యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ లపై పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా విభాగాల్లో పాల్గొనే వారందరూ తమ పేర్లు www.yogandhra.ap.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మొత్తం యోగాంధ్ర కార్యక్రమం ను జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు నిర్వహించిన నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని మండల, జిల్లా స్థాయి లో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీ విభాగంలో యోగా, అనుబంధ కార్యక్రమాలలో జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ప్రతి దశలో పాల్గొనే వారికి ధ్రువపత్రాల జారీ చేయనున్నట్లు తెలిపారు.

యోగా సాధన ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా జిల్లాకి చెందిన ప్రతి ఒక్కరూ www.yogandhra.ap.in లో గ్రామ, మండల , డివిజన్, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో నిర్వహిస్తున్న యోగా ప్రదర్శన లో స్వచ్ఛందంగా పేర్లు నమోదు కు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *