యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజలందరిని భాగస్వాముల్ని చేస్తాం

-మే 27 సెంట్రల్ జైలు లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం
-నాలుగు పర్యాటాక ప్రదేశాల్లో జూన్ 1, 7 , 14, 20 తేదీల్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాల నిర్వహణకు యోగాంధ్ర క్యాలెండర్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇందులో భాగంగా 26వ తేది సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు జిల్లాలో ఒక్కో రోజు ఒక్కో రంగం వారితో యోగా కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.. ‘యోగాం ధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ను అనుసరించి ఈ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.సుశిక్షితులైన యోగా గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణ లో యోగాభ్యాసం ఉంటుందని తెలిపారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హజరు కానున్నట్లు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా షెడ్యూల్ లో ప్రత్యేక కార్యక్రమాలు :

యోగా నేర్చుకున్న వారితో మే 27న తూర్పు గోదావరి జిల్లా లోని కేంద్ర కారాగారం, జైళ్లలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లాలోని 4 పర్యాటక ప్రదేశాల్లో కూడా యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా జూన్ 1 ఆదివారం నాడు సరస్వతి ఘాట్ వద్ద, జూన్ 7 శనివారం సత్యదేవ నర్సరీ, కడియంలో, జూన్ 14 వ తేదీ శనివారం కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో, జూన్ 20 శుక్రవారం నగరవనం లో యోగ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా పై పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి విజేతలు విశాఖ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు.

కేంద్ర కారాగారంలో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన:

యోగాంధ్ర ప్రచార కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ తో జూన్ 27 వ తేదీ మంగళవారం కార్యక్రమ ఏర్పాట్లు విషయమై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచనలను అనుసరించి క్షేత్ర స్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్, ఇతర జైళ్ల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *