ఉగ్రవాదాన్ని సహించేది లేదు : ఎంపీ పురందేశ్వరి

-రవిశంకర్ ప్రసాద్ సారధ్యంలో విదేశాలకు అఖిల పక్ష బృందం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేసారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏడు అఖిల బృందాలలో ఎంపీ పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఆదివారం పారిస్ కి బయలుదేరి వెళ్ళింది. ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్ మీదుగా రాత్రికి పారిస్ కి చేరుకుంది. ఫ్రాన్స్, యుకె, ఈయూ,ఇటలీ ,డెన్మార్క్, జర్మనీ, దేశాలలో పర్యటించి జూన్ 8వ తేదీన భారత్ కి రానున్న ఈ బృందానికి బిజెపి సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతిగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి ఈ బృందం వివరిస్తుంది. ఈ బృందంలో పురందేశ్వరితో పాటు బిజెపి ఎంపీ సామిక్ భట్టాచార్య, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ డా. అమర్ సింగ్, నామినేటెడ్ ఎంపీ గులాం అలీ ఖటాన, ఎంజే అక్బర్, పంకజ్ శరన్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *